మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో ఉన్న కృషి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా టి.బుచ్చిబాబు, ఉపాధ్యక్షుడిగా జి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జి.గిరీష్, సంయుక్త కార్యదర్శిగా పీవీ నాగేశ్వర్ రావు, కోశాధికారిగా ఎ.మహేశ్వర్, కార్యవర్గ సభ్యులుగా బి.రామ్ నవీన్ కుమార్, బి.రాములు, వికాస్ కుమార్ గెహ్లాట్, డి.సాయి విఘ్నేష్, పీఎస్‌వీఆర్ ప్రసాద్, జయ ప్రకాష్ ఎన్‌ఎం, మహేష్ బాబు రామినేని, డి.నాగబాబు రావు, బి.జనార్దన్ రెడ్డి, ఇ.రాజులను ఎన్నుకున్నారు. కాగా నూతన కార్యవర్గం 2022 డిసెంబర్ 19వ తేదీ వరకు పనిచేస్తుందని వారు తెలిపారు.






