శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లో ప్రతి మంగళవారం నిర్వహించే వారాంతపు సంతకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారిక అనుమతి మంజూరు చేసింది. దీంతో జూలై 7 నుంచి ప్రతి మంగళవారం సంత అధికారిక అనుమతులతో యథావిధిగా కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, సీఎంసీ కమిషనర్ సృజనతోపాటు సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మియాపూర్ వెజిటబుల్ మార్కెట్ యూత్ అసోసియేషన్, మార్కెట్ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో బోయిని మహేష్ యాదవ్, అడ్వకేట్ కిషోర్ యాదవ్, లక్ష్మణ్, రాధాకృష్ణ యాదవ్, గణేష్ ముదిరాజ్, దేవేందర్, రాము, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మార్కెట్కు అధికారిక అనుమతి రావడంతో వ్యాపారులు, వినియోగదారులకు సౌకర్యవంతమైన వాతావరణంలో సంత నిర్వహణకు మార్గం సుగమమైందని మార్కెట్ కమిటీ పేర్కొంది.





