శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మహిళలకు తన చేతుల మీదుగా గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు మిరియాల ప్రీతమ్‌ను అభినందించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలకు గొడుగులు పంపిణీ చేయడం అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు.

మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు, రజిని, కవిత, సంగీత, ఆశ, త్రిలోచ్‌తోపాటు పలువురు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





