కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌కు ఆర్య వైశ్య సంఘ సభ్యుల స‌న్మానం

కొండాపూర్ ‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట్ లోని ఆర్య వైశ్య సంఘ సభ్యులు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ని ఘనంగా సన్మానించారు. రెండవ సారి కొండాపూర్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన సందర్భంగా హ‌ఫీజ్ పేట్ ఆర్య వైశ్య సంఘ సభ్యులు కార్పొరేటర్ హమీద్ పటేల్ ని సన్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. త‌న‌ విజయం కోసం వెన్నంటి ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్య కుటుంబ సభ్యుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు. ఇతరులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా పట్టించుకోకుండా త‌న‌ను గెలిపించడం ప‌ట్ల సంతోషంగా ఉన్నాన‌ని అన్నారు. కొండాపూర్ డివిజన్ లో తాను చేసిన అభివృద్ధికి పట్టం కట్టినట్లు భావిస్తున్నాని, ఎప్పుడూ ప్రజల్లో ఒకడిగా ఉంటూ డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్ ను స‌న్మానించిన ఆర్య వైశ్య సంఘం సభ్యులు
కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్ ను స‌న్మానించిన ఆర్య వైశ్య సంఘం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here