- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో పోలీస్ శాఖ, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.6 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్ రావు, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీ చంద్ర శేఖర్, కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. కాలనీ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్ వాసుల వారు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు జరగకుండా అడ్డుకోవచ్చన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే ఫండ్ ద్వారా రూ.1 కోటి కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, తెరాస నాయకులు పోతుల రాజేందర్, వెంకటేష్ యాదవ్, సత్యనారాయణ, సిద్ధం శ్రీకాంత్, నర్సింగ్ రావు, అనిల్, శేఖర్, సుధాకర్ రెడ్డి, కృష్ణ కుమారి, గంగా భవాని, విమల, రేణుక, ప్రమీల, పర్వీన్ సుల్తానా, తులసి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకట్ రావు, అధ్యక్షుడు ఎస్ఎం బాబు, ప్రధాన కార్యదర్శి పరుచూరి నాగేశ్వర్ రావు, జాయింట్ సెక్రటరీ మల్లేశం, ట్రెజరర్లు సాంబశివరావు, శ్రీకాంత్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.