శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ లోని తుల్జా భవాని అమ్మవారి ఆలయాన్ని మంగళవారం చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామ కార్పొరేట్ దంపతుల పేరిట కుంకుమ అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లికార్జున్ శర్మ, సంజీవ రెడ్డి, రేణుక గౌడ్, ప్రసాద్, టీఆర్ఎస్ నాయకుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.







