శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంజనీర్స్ ఎన్‌క్లేవ్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి నివాసంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (రక్తసాక్షి దినోత్సవం) సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, డివిజన్ అధ్యక్షుడు కె. జితేంద్ర, డివిజన్ ఉపాధ్యక్షుడు త్రిపాఠి ప్రసాద్ పాత్రో, డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు దేవానంద్, వెంకటరమణ, శ్రీనివాస్, రాజేష్ తివారీ, రామ్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం, జనసంఘ్ పార్టీ బలోపేతం కోసం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పోషించిన పాత్రతోపాటు దేశ అభివృద్ధికి అందించిన విశేష సేవలను కొనియాడారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు.





