శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో రెండవసారి కార్పొరేటర్ గా గెలుపొంది మొదటి సారి ఆదర్శ్ నగర్, నెహ్రూ నగర్ లో పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ప్రజలు పూలమాలలు, శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్ లో డివిజన్ తెరాస ఉపాధ్యక్షులు యాదా గౌడ్, సత్యనారాయణల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదట ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించి కాలానీలో పాదయాత్రగా బయలుదేరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాలనీలో ఆయన పర్యటించినప్పడు కాలానీ వాసులు డ్రైనేజీ నిండి ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, వార్డుమెంబర్ పర్విన్, రాజేశ్వరమ్మ, కె.ఎల్లదాసు, కె.ఎన్.రాములు, శ్రీకాంత్, గోపినగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఘనపురం రవీందర్ యాదవ్, మహేందర్ సింగ్, దినేష్ సింగ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, సాయి కిరణ్ గౌడ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, నాని, షైబద్ యాభా, రమేష్ పాల్గొన్నారు.






