అంగన్‌వాడీ కేంద్రాలకు బీఎల్‌వై చారిటబుల్ ట్రస్ట్ అండ

శేరిలింగంప‌ల్లి, జూన్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హ‌ఫీజ్‌పేట్ ప్రాంతంలో ఉన్న‌ అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులు, సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీఎల్‌వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6 అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్‌లను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి గ్యాస్ స్టవ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాల‌ను కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

గ్యాస్ స్టవ్‌ల పంపిణీతో కేంద్రాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని అంగన్‌వాడీ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బీఎల్‌వై చారిటబుల్ ట్రస్ట్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ్ యాదవ్, అఖిల్, సురేఖ, లక్ష్మణ్, నరేష్, మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here