మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఎంఏ నగర్, అమాన్ కాలనీ వాసులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. అందుకు ఆయన స్పందిస్తూ త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.







