శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ విజయ దుర్గా దేవి వార్షికోత్సవం

మియాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ విజయ దుర్గా దేవి వార్షిక ఉత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 108 ఔషధాలతో ఆయ‌ర్వేద పితామ‌హుడు ధ‌న్వంత‌రికి అభిషేకం చేప‌ట్టారు. అనంత‌రం పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా కోటి వ‌త్తుల‌తో దీపారాధ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఖాదర్ వలీ, రవి వర్మ, బి.లక్ష్మీ, పెద్ది రమాదేవి, సుచితల‌ను విజయ దుర్గా దేవి సన్నిధిలో భారతీయం సత్యవాణి, అట్లూరి సుబ్బారావులు ఘనంగా సన్మానించారు.

ధ‌న్వంత‌రి మ‌హ‌ర్షికి పూజ‌లు చేసిన దృశ్యం
ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిస్తున్న విజ‌య‌దుర్గా దేవి అమ్మ‌వారు
ఆయుర్వేద వైద్యురాలిని స‌న్మానిస్తున్న భారతీయం సత్యవాణి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here