మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్
సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఉన్న చిల్ల ఈ గౌస్ ఈ అజాం దస్తగిర్ దర్గాను బీజేపీ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్ మంగళవారం సందర్శించారు. బీజేపీ నాయకుడు ఖలీల్ ఆహ్వానం మేరకు ఆయన దర్గాను సందర్శించారు. ఆయన వెంట శ్రీనివాస్ యాదవ్, కృష్ణగౌడ్, బాలకుమార్, వెంకట్, భాను, అరవింద్ సింగ్ ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్ పాల్గొన్నారు.







