ప్ర‌జ‌ల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రిస్తాం: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్

మియపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా త‌న దృష్టికి తీసుకువ‌స్తే వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ తెలిపారు. ఆదివారం డివిజ‌న్ ప‌రిధిలోని సుభాష్ చంద్ర‌బోస్ న‌గ‌ర్ కాల‌నీలో ఆయ‌న ప‌ర్య‌టించారు. స్థానికంగా నీటి స‌మ‌స్య ఉంద‌ని కాల‌నీవాసులు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న అక్క‌డ ప‌ర్య‌టించి స‌మ‌స్య‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. వెంట‌నే ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీతోపాటు సంబంధిత అధికారుల‌కు స‌మ‌స్య‌ను ఆయ‌న వివరించారు. వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, నీటి స‌మ‌స్య లేకుండా చూస్తామ‌ని స్థానికుల‌కు ఆయ‌న హామీ ఇచ్చారు.

స్థానికుల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here