మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో ఉన్న రెట్రో డ్రైవ్‌లో ఎర్రగుడ్ల ముత్యాలు యాదవ్ దశ దిన కర్మను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్, హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, మంజుల రాఘునాథ్ రెడ్డిలు కార్యక్రమానికి హాజరై ముత్యాలు యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భేరి రామచందర్ యాదవ్, ముత్యాలు యాదవ్ కుమారులు రాజు యాదవ్, ప్రభాకర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, నవీన్ యాదవ్, బాలకృష్ణ యాదవ్, అఖిల్ యాదవ్, సోదరులు మల్లేష్ యాదవ్, నర్సింగ రావు యాదవ్ పాల్గొన్నారు.






