హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట గ్రామంలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్.గోపాల్ గౌడ్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ గౌడ్, కుమారి శ్రీశైలం, కుమారి యాదయ్య, అనంతరాంగౌడ్, తలారి వెంకటేష్, శంకర్ గౌడ్, మల్లేష్ గౌడ్, జగన్, జీవన్‌గౌడ్ పాల్గొన్నారు.







