చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శాంతి నగర్ కాలనీ సమస్యలు, పీజేఆర్ స్టేడియంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని నాయకుడు అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి నగర్ కాలనీ వాసులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిలక్, రవి, హరి, నరేష్, సతీష్, జగన్, నాగరాజు, రామకృష్ణ, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, సత్యనారాయణ పాల్గొన్నారు.






