భక్తాంజనేయ స్వామికి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతుల పూజ‌లు

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు శ‌నివారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకుడు రంగాచార్య కార్పొరేటర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలవడంతో శ్రీ భక్తాంజనేయ స్వామి మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఆంజనేయస్వామిని వేడుకున్నట్లుగా ఆమె తెలిపారు. ఆలయానికి కావ‌ల్సిన మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉరిటి వెంకట్ రావు, ధన లక్ష్మీ, సుప్రజా ప్రవీణ్ పాల్గొన్నారు.

భక్తాంజనేయ స్వామి ఆల‌యంలో పూజ‌లు చేసిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంప‌తులు
కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంప‌తుల‌కు తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేస్తున్న ఆలయం ప్రధాన అర్చకుడు రంగాచార్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here