ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా వివేకానంద నగర్‌లోని ఆయన నివాసంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఉప్పలపాటి శ్రీకాంత్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్, మాధవరం గోపాల్ రావు, రాజు గౌడ్, శ్రీనివాస్‌తో పాటు మియాపూర్ డివిజన్ నాయకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here