శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వర నగర్ కాలనీలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్తో కలిసి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా షేక్ హమీద్ పటేల్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరుకున్నారు.





