శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తెలిపారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి హఫీజ్‌పేట్, మదీనాగూడ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఇందులో భాగంగా హఫీజ్‌పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు సమిష్టిగా మహాధర్నా కార్యక్రమానికి బయలుదేరారు.







