ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. పోలా రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలా రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చందానగర్ సీఐ శ్రీధర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. యాదవ చారి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీచర్ల సేవలను గుర్తిస్తూ సుమారు 80 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు.

ఫౌండేషన్ చైర్మన్ పోలా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాణి, శ్రీకాంత్, పురం ఆంజనేయులు, శివకుమార్, భవాని, మారం వెంకట్, పోలా రాములు, సుధాకర్, నాగమల్లేష్, భావన, ఋషి, ప్రభాకర్, మాశెట్టి, ముక్క పృథ్వీ, లక్ష్మి, నర్సింహ, శైలజ, భవాని, సుచేత, అశోక్, ఎంఈఓ బైసాని వనజ, శంకర్, అంతిరెడ్డి, ఆనంద్, జేఎన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here