మలబార్ గోల్డ్ ఆర్టిస్ట్రీ షో.. ఆగస్టు 24 వరకు ప్రత్యేక జ్యువెలరీ ప్రదర్శన

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ షోరూంలో ఆర్టిస్ట్రీ షో పేరుతో ప్రత్యేక బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శన ప్రారంభమైంది. ఆగస్టు 14 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాలు, జాతిరత్నాలతో రూపొందించిన ప్రత్యేక ఆభరణాలను అందుబాటులో ఉంచారు. ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువెల్ అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ షోలో కళాత్మక డిజైన్లు, నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆర్టిస్ట్రీ షోలో మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు చెందిన పలు బ్రాండ్ల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివాహాలు, పార్టీల కోసం మైన్ బ్రాండ్‌లో ధ్రువీకరించిన వజ్రాభరణాలు, అన్కట్ వజ్రాలతో ఎరా ప్రత్యేక శ్రేణి, జాతిరత్నాలతో ప్రెష్యా, హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన ఎత్నిక్స్ ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. అలాగే తేలికపాటి ఆధునిక డిజైన్లతో జోల్, భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే డివైన్, చిన్నారుల కోసం స్టార్లెట్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రకటించిన 12 న్యాయమైన వాగ్దానాలను కూడా సంస్థ ప్రస్తావించింది. తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, రాళ్ల విలువను స్పష్టంగా చూపించే ధరల పట్టీ, జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారాన్ని తిరిగి విక్రయించే సమయంలో బంగారానికి 100 శాతం విలువ, బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు వంటి హామీలను అందిస్తున్నట్లు తెలిపింది.

వజ్రాభరణాల మార్పిడిపై 100 శాతం విలువ, 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్‌తో హెచ్‌యూఐడీ బంగారం, ఐజీఐ, జీఐఏ ధ్రువీకరించిన వజ్రాభరణాలు, 28-పాయింట్ల నాణ్యత పరీక్షలు, బైబ్యాక్ గ్యారెంటీ, క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ, బాధ్యతాయుతమైన వనరుల నుంచి బంగారం సేకరణ వంటి అంశాలను సంస్థ తన వాగ్దానాల్లో పేర్కొంది. 1993లో కేరళలో స్థాపించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో 450కి పైగా షోరూములు, 14 హోల్‌సేల్ యూనిట్లు, కార్యాలయాలు, డిజైన్ కేంద్రాలు, ఫ్యాక్టరీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, యూకే, అమెరికా, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ తదితర ప్రాంతాల్లో సంస్థకు రిటైల్ నెట్‌వర్క్ ఉంది. గ్లోబల్ జ్యువెలరీ రిటైలర్లలో ఆరో స్థానంలో ఉన్నట్లు, డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ 2023 ర్యాంకింగ్‌లో 19వ స్థానాన్ని సాధించినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here