శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాదాపూర్‌లోని NAC భవనంలోని CMC ప్రధాన కార్యాలయంలో శనివారం CMC కమిషనర్ సృజన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు, చీఫ్ సిటీ ప్లానర్, విజిలెన్స్ విభాగం అధికారులు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా CMCలో అంకితభావంతో, ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్న పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా సత్కరించారు. NAC లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ జోన్లకు చెందిన 16 మంది పారిశుధ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. శేరిలింగంపల్లి జోన్ నుంచి నార్సింగి-45కు చెందిన కామణి పద్మమ్మ, పటాన్‌చెరు-46కు చెందిన కొండ రమేష్, అమీన్‌పూర్-47కు చెందిన బి. రాజు, మియాపూర్-48కు చెందిన ఉప్పలమ్మ, శేరిలింగంపల్లి-49కు చెందిన పెంటమ్మ సత్కారం అందుకున్నారు.

కూకట్‌పల్లి జోన్ నుంచి మాదాపూర్-50కు చెందిన పి. లక్ష్మి, ఆల్విన్ కాలనీ-51కు చెందిన ఎ. సత్యమ్మ, కూకట్‌పల్లి-52కు చెందిన జి. నవనీత, మూసాపేట్-53కు చెందిన అర్రవల్లి విజయను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కుత్బుల్లాపూర్ జోన్ నుంచి చింతల్-54కు చెందిన సి. మానెమ్మ, జీడిమెట్ల-55కు చెందిన ఎ. నర్సింహారావు, కొంపల్లి-56కు చెందిన ఆర్. స్వరూప, గాజులరామారం-57కు చెందిన వోని యాదగిరి, నిజాంపేట్-58కు చెందిన డి. ప్రమీల, దుండిగల్-59కు చెందిన వి. నరేష్, మేడ్చల్-60కు చెందిన దొమ్మ యాదమ్మను సత్కరించారు. పరిశుభ్రమైన నగర నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య సిబ్బంది సేవలను గుర్తించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారిని గౌరవించడం పట్ల అధికారులు అభినందనలు తెలిపారు.





