శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు రాగం సుజాత మృతి పట్ల కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళల అభ్యున్నతికి రాగం సుజాత చేసిన కృషి మరువలేనిదని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోనియా గాంధీ మహిళా సేనను స్థాపించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె అందించిన సేవలు అభినందనీయమన్నారు. సుజాత అకాల మరణం స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.






