మాదాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో సెక్టార్‌ల పునర్వ్యవస్థీకరణ.. ప్రాంతాల వారీగా అధికారుల వివరాలు విడుదల

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 6 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా పోలీసు సేవలు అందించేందుకు మాదాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిని సెక్టార్‌ల వారీగా విభజిస్తూ ఆయా ప్రాంతాలకు బాధ్యత వహించే పోలీసు అధికారుల వివరాలను సైబరాబాద్ పోలీసులు విడుదల చేశారు. మొత్తం ఎనిమిది సెక్టార్‌లుగా విభజించిన పరిధిలో ప్రతి సెక్టార్‌కు ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐపీ)ని నియమించారు. మాదాపూర్ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (SHO)గా ఇన్‌స్పెక్టర్‌ కె.వి. సుబ్బారావు (మొబైల్: 8712663100), డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పి. రమేష్ (8712663101) విధులు నిర్వహిస్తున్నారు. డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పి. బాలరాజ్ (8712568162) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెక్టార్-1లో గుట్టల బేగంపేట్‌, వడ్డెర బస్తీ, మాదాపూర్‌ (భాగం), మేఘా హిల్స్‌, అయ్యప్ప సొసైటీ ఫేజ్-2, రవీంద్ర సొసైటీ, సరోజినీ నాయుడు నగర్‌, శ్రీరామ కాలనీ, సున్నం చెరువు, నవభారత్‌ నగర్‌, కాకతీయ హిల్స్‌ ప్రాంతాలు ఉండగా, జి. సురేష్‌ కుమార్ (8712663107) ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

సెక్టార్-2లో అయ్యప్ప సొసైటీ ఫేజ్-1, సాయి నగర్‌, జైహింద్‌ ఎన్‌క్లేవ్‌, ఇమేజ్‌ గార్డెన్‌, సిలికాన్‌ వ్యాలీ, హరిజన్‌ బస్తీ, అరుణోదయ కాలనీ, నిఫ్ట్‌ క్యాంపస్‌, క్యాపిటల్‌ ల్యాండ్‌ ఐటీ పార్క్‌ ప్రాంతాలకు కె. గిరీష్‌ కుమార్ (8712663102) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెక్టార్-3లో పర్వత్‌ నగర్‌, చంద్ర నాయక్‌ తండా, 100 ఫీట్‌ రోడ్‌, ఎస్‌బీఐ కాలనీ, బోరబండ న్యూ రోడ్‌, సిద్ధి వినాయక నగర్‌, బుట్ట కన్వెన్షన్‌, వి కన్వెన్షన్‌, మెరిడియన్‌ స్కూల్‌, ఏపీ మోడల్‌ స్కూల్‌, శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు, టాటా మోటార్స్‌ షోరూమ్‌ పరిధిలో ఉండగా జి. నరేష్‌ కుమార్ (8712663103) ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సెక్టార్-4లో కొత్తగూడ (భాగం), ఖానామెట్‌, ఇజ్జత్‌ నగర్‌, హెచ్‌ఐసీసీ, నోవోటెల్‌, హైటెక్‌ రైల్వే స్టేషన్‌, జయభేరి సిలికాన్‌ కౌంటీ, యశోద హాస్పిటల్‌, హైటెక్స్‌, గూగుల్‌ కార్యాలయం వంటి ప్రాంతాలకు జె. కృష్ణయ్య (8712663104) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సెక్టార్-5లో శిల్పారామం, శిల్పకళా వేదిక, వైట్‌ఫీల్డ్స్‌, జూబ్లీ ఎన్‌క్లేవ్‌, డెల్‌, సైబర్‌ గేట్‌వే, టెక్‌ మహీంద్రా, ఒరాకిల్‌, ట్రైడెంట్‌, లెమన్‌ ట్రీ హోటళ్లు, మెడికోవర్‌, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌, ఫీనిక్స్‌ మాల్‌ పరిధిలో ఉండగా కె. శ్రీనివాసులు (8712663105) ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సెక్టార్-6లో గఫూర్‌ నగర్‌, పత్రికా నగర్‌, విఠల్‌రావు నగర్‌, మై హోమ్‌ నవద్వీప్‌, సైబర్‌ టవర్స్‌, మైండ్‌స్పేస్‌, ఇనార్బిట్‌ మాల్‌, టీసీఎస్‌, యూఎస్‌ వీసా కార్యాలయం, పేస్‌, మెడికోవర్‌ ఆసుపత్రులు తదితర ప్రాంతాలకు కె. రాఘవేందర్‌ గౌడ్‌ (8712580061) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెక్టార్-7లో కావూరి హిల్స్‌ ఫేజ్-3, అమర్‌ సొసైటీ, మస్తాన్‌ నగర్‌, దుర్గం చెరువు, డాక్టర్స్‌ కాలనీ, ఇమేజ్‌ హాస్పిటల్‌, విక్రమ్‌ హాస్పిటల్‌, డీ-మార్ట్‌, బ్రౌ (BRAOU), వీ-హబ్‌, టీ-శాట్‌ నెట్‌వర్క్‌, కేబుల్‌ బ్రిడ్జ్‌ ప్రాంతాలకు సంతోష్‌ కుమార్ (8712554121) ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సెక్టార్-8లో భిక్షపతి నగర్‌, ఆర్టీఓ కార్యాలయం, హనుమాన్‌ నగర్‌, కొండాపూర్‌ (భాగం) ప్రాంతాలను ఎం. నంద గోపాల్‌ (8712566887) పర్యవేక్షిస్తున్నారు. తమ ప్రాంతానికి సంబంధించిన శాంతిభద్రతలు, అత్యవసర సమస్యలు లేదా పోలీసు సహాయం కోసం ఆయా సెక్టార్‌ అధికారులను నేరుగా సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here