తొలి ఏకాదశి సందర్భంగా తమలపాకు మొక్క నాటిన వెంకటేశ్వర్లు

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 33/11 కేవీ లోధా సబ్‌స్టేషన్ ఆవరణలో సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ (327 ఐఎన్‌టీయూసీ) కె. వెంకటేశ్వర్లు పవిత్రమైన తమలపాకు మొక్కను నాటారు. ప్రతిరోజూ పూజా కార్యక్రమాల్లో వినియోగించే తమలపాకు మొక్కను నాటడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, కార్యాలయాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి వృక్షాల పెంపకం ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని, మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here