గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, జూలై 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆదివారం కొండాపూర్‌లోని ప్రెస్టీజ్ ఐవీ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా, కొత్తగూడ నుంచి గూగుల్ కార్యాలయానికి వెళ్లే ర‌హ‌దారి ప‌క్క‌న ఓ వ్య‌క్తి మృత‌దేహం ప‌డి ఉంద‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుని వ‌య‌స్సు సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాల వ‌ర‌కు ఉంటుంద‌ని, నీలం రంగు టీ-షర్ట్, నలుపు రంగు షార్ట్స్ ధరించి ఉన్నాడ‌ని, గుర్తు ప‌ట్ట‌ద‌ల‌చిన వారు త‌మ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని పోలీసులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here