శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): భారాస అధినేత కె. చంద్రశేఖర్ రావును శేరిలింగంపల్లి ఉద్యమనాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ ఆత్మీయంగా కలిశారు. ఏఐజీ ఆస్పత్రిలో హిమాన్సును పరామర్శించిన అనంతరం తిరుగు ప్రయాణంలో కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి మర్యాదపూర్వకంగా అభివాదం చేశారు. చిర్రా రవీందర్ యాదవ్‌ను చూసిన కేసీఆర్.. బాగున్నావా రవీందర్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. దీనికి రవీందర్ యాదవ్ బాగున్నాను సార్ అని సమాధానమిచ్చారు. అనంతరం ఆయన భుజం తట్టి అభినందించిన కేసీఆర్.. యువకుడివి.. మరింత దూసుకెళ్లాలి అంటూ ప్రోత్సాహం అందించారు. ఇద్దరూ కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎవరూ చెరిపివేయలేరన్నారు. రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భారాస బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో గులాబీ జెండా రెపరెపలాడేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని రవీందర్ యాదవ్ తెలిపారు. అలాగే కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై భారీ మెజార్టీ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.





