శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): ఇజ్జత్‌నగర్ తెలంగాణ ఐక్యత ముదిరాజ్ సంఘం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని శ్రీ శ్రీ శ్రీ కైతలాపూర్ పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన కార్యక్రమానికి ముదిరాజ్ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరైన రవికుమార్ యాదవ్ అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, ఇజ్జత్‌నగర్ తెలంగాణ ఐక్యత ముదిరాజ్ సంఘం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. కేవలం ముదిరాజ్ సంఘమే కాకుండా బీసీ వర్గాలకు చెందిన అన్ని కుల సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని, బీసీలందరూ ఒకచోట కలిసే వేదికలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. సామాజిక ఐక్యతతోనే బీసీల సాధికారత సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, సంతోష్, గోవర్ధన్, కృష్ణయ్య, సుధాకర్, సలేశ్వరం, రాములు, భిక్షపతి, కుర్మయ్య, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.






