శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో చేయూత (వృద్ధాప్య/ఇతర), వితంతువు, దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరూ తప్పనిసరిగా తమ పెన్షన్ స్క్రీనింగ్/వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు సూచించారు. డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీలో ఉన్న ఆల్విన్ కాలనీ సర్కిల్-51 కార్యాలయంలో లబ్ధిదారులు హాజరై స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి పెన్షన్ నగదు వచ్చే నెల నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవచ్చని హెచ్చరించారు. అందువల్ల లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, పెన్షన్ పాస్‌బుక్‌తోపాటు అవసరమైన పత్రాలు తీసుకుని ఆలస్యం చేయకుండా ఆల్విన్ సర్కిల్-51 కార్యాలయానికి వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 91215 72729, 98490 35437 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.





