బక్రీద్ సందర్భంగా జమ్మర్ లిమ్రా నివాసంలో ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బక్రీద్ పండుగ సందర్భంగా జమ్మర్ లిమ్రా నివాసంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తోపాటు హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ఉరిటి వెంకట్ రావ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముస్లింలను ఆప్యాయంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోదరభావం, ప్రేమాభిమానాలు, సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here