శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు రాజు శెట్టి కురుమ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప సెంటర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక పేద ప్రజలు భారీ సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. శిబిరంలో భాగంగా దాదాపు 121 మంది పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లజోళ్లను అందజేశారు. అలాగే మరో 201 మంది ప్రజలకు వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు శెట్టి కురుమ మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు పరిమితం చేయకుండా పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం సమాజానికి మంచి సందేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నరసింహ, సూర్ణ శ్రీశైలం, కౌసల్య, ఈరు సిద్దు, ఎల్లేష్, నీలకంఠం రెడ్డి, మల్లేశం, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.






