నెరేళ్ల చెరువు సుంద‌రీక‌ర‌ణ‌కు కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ‌ విలేజ్ నెరేళ్ల చెరువులో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను DC బాలక‌ష్ణ, మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు , రవీందర్ ముదిరాజ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ నెరేళ్ల చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంద‌ని అన్నారు. చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు చెరువులో కలవ‌కుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు, చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మురుగు నీటి మళ్లింపు పైప్ లైన్ ద్వారా చెరువులో కలుషిత నీరు కలవకుండా సస్యశ్యామలం గా, చక్కటి ఆహ్లాదకరంగా చెరువును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here