మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద పీట‌: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ‌, దుర్గం చెరువు, విఠల్ రావు నగర్ కాలనీలలో రూ. 3 కోట్ల 71 లక్షల తో నూతనంగా చేపట్టబోయే హిందూ శ్మ‌శాన వాటిక, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు డీసీ బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్లు హ‌మీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, రవీందర్ ముదిరాజ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం కొత్తగూడ‌, దుర్గం చెరువు, విఠల్ రావు నగర్ కాలనీలలో రూ. 3 కోట్ల 71 లక్షలతో నూతనంగా చేపట్టబోయే హిందూ శ్మ‌శాన వాటిక, బీటీ రోడ్లు , సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింద‌ని, సీసీ రోడ్ల పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీ వాసులకు ఉపశమనం లభించింద‌ని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here