కాయ‌ద‌మ్మ‌కుంట చెరువు ప‌నుల‌ను ప‌రిశీలించిన బాలింగ్ గౌతమ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ కాయ‌ద‌మ్మ‌కుంట చెరువు వద్ద కొన‌సాగుతున్న అభివృద్ధి పనులను ప‌రిశీలించారు. ఏఈ గులాం, DE రాజశేఖర్, ఇన్చార్జ్ చైతన్య పర్యవేక్షణలో పనులు వేగంగా కొనసాగుతుండ‌గా, చెరువు చుట్టూ ప్రధాన ఆకర్షణలుగా ఆహ్లాదకరమైన పచ్చదనం, ఆధునిక నడక మార్గాలు, మెరుగైన పరిశుభ్రత, ఇతర సదుపాయాలు నిల‌వ‌నున్నాయి. త్వ‌రలోనే ఈ ప్రాంతం ప్రజలకు ఒక అద్భుతమైన వినోద, విశ్రాంతి కేంద్రంగా అందుబాటులోకి రానుంద‌ని ఈ సందర్భంగా గౌత‌మ్ గౌడ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here