హుడా కాలనీలో లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవం

శేరిలింగంప‌ల్లి, జూన్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రవికుమార్ యాదవ్, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ, నాయకులు విష్ణు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here