శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ రాధా మాధవ్ అపార్ట్‌మెంట్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సమితి ధ్యానమందిరం ప్లాట్ నం.166లో సంగీత, భక్తి, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న ఆదివారం జరగనున్న ఈ పాటల పోటీలకు ఔత్సాహికులు ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాలని, అందుకు మియాపూర్‌లోని సమితి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9346761610 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.






