శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం, అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఎస్‌ఎల్‌వి మ్యూజిక్ అకాడమీ శిష్య బృందం గీత, వాణి, స్రవంతి, ముకుంద్, నారాయణ, ఆశ్రిత, చరణ్, భూమి, మూర్తి, పటేల్, గౌతమి, నరసింహ, విక్రమ్, నాగార్జున, శ్రీనివాస్ తదితరులతో కలిసి సుమారు 25 మంది విద్యార్థులు, చిన్నారులు సంయుక్తంగా వాడల వాడల వెంట వసంతము, జగడపు చనువుల, బెట్రాయ సామి దేవుడా, చూడరమ్మ సతులాల, గరుడ గమన, వేడుకొందామా, పిడికిట తలంబ్రాల అనే అన్నమాచార్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి సంకీర్తనలకు భక్తిరస మాధుర్యాన్ని పంచారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ విద్యార్థులను, గురువులను అభినందించి, అన్నమయ్య సంకీర్తనలను చిన్నారుల్లో విస్తరింపజేస్తున్న విధానం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.





