జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రభుత్వ పాఠశాలలో జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలను నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులతో ఆనందాన్ని పంచుకున్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా పాఠశాల చిన్నారులకు స్టేషనరీ కిట్లు పంపిణీ చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు విద్యతోపాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్, మల్లేష్ నాయి, భాషా భాయ్, మహేష్, దేవేందర్, వెంకటేష్, పవన్, రహమత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here