అల్లూరి సీతారామ‌రాజుకు ఘ‌న నివాళులు

శేరిలింగంప‌ల్లి, మే 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడ‌ని కొనియాడారు. గురువారం ఆయ‌న 102 వ వర్థంతి సంద‌ర్భంగా ఉషముళ్ళపూడి కమాన్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశానికి బ్రిటిష్ పాల‌న నుంచి విముక్తి ల‌బిస్తుందని న‌మ్మి తెల్ల‌దొర‌ల పైకి విల్లు ఎక్కుపెట్టిన ధీరుడు అని అన్నారు. అతి చిన్న వ‌య‌సులోనే బ్రిటిష‌ర్ల‌ను 2 సంవత్సరాలు కంటిమీద కునుకు లేకుండా చేసి గ‌డ‌గ‌డ‌లాడించిన అల్లూరిని తుపాకుల‌తో కాల్చి చంపుతున్నా వందేమాత‌రం అని నిన‌దించిన గొప్ప మ‌హానీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here