శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నర్సింహ గౌడ్ 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ తో కలిసి పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్ పాల్గొని నర్సింహ గౌడ్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న ఈ ఆదర్శ దంపతులు, ఆ అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మరిన్ని సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు.






