మే 10న ప్ర‌ధాని మోదీ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, మే 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడవసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు, తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు తొలిసారి హైదరాబాద్ కు వ‌స్తున్న సందర్భంగా మే 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ స‌భ నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న ప్రచార కార్యక్రమాలలో భాగంగా వాల్ రైటింగ్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 7,823 కోట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, రైల్వే స్టేషన్లు, నేషనల్ హైవేల వల్ల చాలా సౌకర్యాలు ల‌భించ‌నున్నాయ‌ని అన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వసంతి యాదవ్, రామరాజు, కేశవులు, మణిని భూషణ్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు సాగర్ , రమేష్ , పద్మా , కాంచన కృష్ణ, జితేందర్, ఆకుల లక్ష్మణ్, అరుణ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here