అంబేద్క‌ర్ మూలంగానే తెలంగాణ వ‌చ్చింది: రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డా. బీ.ఆర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే రాజ్యాంగ బద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంద‌ని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి రాగం నాగేందర్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్‌ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానికవాసులుకు మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు ప్రవీణ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రొఫెసర్ పశునూరి రవీందర్, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, గఫుర్, సాయన్న, ఆరంభ టౌన్షిప్ మాజీ అధ్యక్షుడు రవీందర్ రాథోడ్, హరి, నీలకంఠ రెడ్డి, వెంకటేష్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీకాంత్ దేవులపల్లి, రవీందర్, మహేందర్, సుధాకర్, సారయ్య గౌడ్, కుమార్, బాలు, శ్రీకాంత్, నాగరాజు, శీను, సత్తార్, సాయి, పట్లోళ్ల నర్సింహ‌, జానీ, షకీల్, కుమార్, విజయ్, రాజు, మహేందర్ సింగ్, రమణ, నాగి రెడ్డి, సత్యనారాయణ, జనార్దన్, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, కుమారి, సుజాత, సౌజన్య, రోజా రాణి, జయ, సబియా, జయమ్మ, గౌసియా, ఫాతిమ, సరిత, రాజమణి, సత్యమ్మ, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here