శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, భెల్ ఉద్యోగులు, కళాశాల విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అందరితో రోడ్డు భద్రత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్ కుమార్, భెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస రావు, మాదాపూర్ ట్రాఫిక్ జోన్ ఏడీసీపీ హనుమంత రావు, ఆర్సీ పురం డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ రావు, మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ ఆది మూర్తి, ఆర్సీ పురం ట్రాఫిక్ పీఎస్ సీఐ విద్యా సాగర్ రెడ్డి, పటాన్ చెరు ట్రాఫిక్ పిఎస్ సీఐ లాలు నాయక్, ఆర్సీ పురం పిఎస్ సీఐ సురేష్ బాబు, మియాపూర్ ట్రాఫిక్ పిఎస్ సీఐ ప్రశాంత్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






