రోడ్డు భ‌ద్ర‌త‌పై ఆర్‌సీ పురం గ్రామస్తుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అరైవ్ అలైవ్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్‌సీ పురం విలేజ్‌లో రోడ్డు భ‌ద్ర‌త అవ‌గాహ‌న‌పై ఆర్‌సీ పురం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌పై గ్రామ‌స్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ప్ర‌మాదాల‌ను ఎలా నివారించాలి అనే అంశంపై గ్రామ‌స్తుల‌కు వివ‌రాలు తెలియ‌జేశారు. ట్రాఫిక్ నియ‌మాల‌ను పాటించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా గ్రామానికి చెందిన ప్ర‌ముఖులతో ఓ విలేజ్ లెవ‌ల్ క‌మిటీని ఏర్పాటు చేశారు. అలాగే వాట్సాప్ గ్రూప్‌ల‌ను క్రియేట్ చేసి వాటి ద్వారా గ్రామ‌స్తుల‌కు రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పూనుకున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారుల‌ను సైతం ఇందులో భాగం చేసి బీరంగూడ ప్రాంతంలో ర‌హ‌దారుల‌పై ఉన్న గుంత‌ల‌ను పూడ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here