కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూలే ఆశయాన్ని తుంగలో తొక్కాయి: బీసీ పొలిటికల్ ఫ్రంట్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్యాంక్ బండ్, పీవీ మార్గంలో ఫూలే విగ్రహాన్ని నెలకొల్పుతామని అట్టహాసంగా తెలిపార‌ని, ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్న పూలే విగ్రహానికి జయంతి వేడుకలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిద‌ని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఒక పక్క వేధిస్తూ పూలే జయంతి వేడుకలను చేస్తుంద‌ని, చట్టసభల్లో బీసీలకు రావలసిన వాటాను ఇచ్చినప్పుడే పూలేకు అసలైన నివాళి అని అన్నారు. బిసి పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని పార్టీ కార్యాలయంలో జ్యోతిబాపూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బలహీన వర్గాలకు దిశా నిర్దేశం చేసిన మహానీయుడు జ్యోతిబాపూలే అని, చదువుతోనే ఎదుగుదల ఉంటుందని నేర్పిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ ఎలికట్టి విజయ్ కుమార్, అంబాల నారాయణ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, ఎంబీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు బడే సాబ్, నాగభూషణం, హర్షవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here