శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బిసి ఐక్యవేదిక, బీసీ కులాల సంఘాల రాష్ట్ర ముఖ్య కార్యాలయం వద్ద మహాత్మ పూలే చిత్రపటానికి అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి సమాజంలో ఉన్న దురాచారాల కారణంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలు చదువుకు నోచుకోలేదని, అలాంటి సమయంలో ఫూలే దంపతులు పేదల చదువు కోసం కృషి చేశారని అన్నారు. అలాగే మహిళలపై జరిగే అత్యాచారాలను అరికట్టి వారు కూడా చదువుకోవాలని ప్రచారం చేశారని తెలిపారు. జ్యోతిరావు ఫూలే చూపిన బాటలో బీసీలు, ఎస్సీలు, ఎస్‌టీలు సంఘటితంగా మారి హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొంటుముకుందం, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, సలహాదారు కృష్ణమోహన్, బిసి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యువజన అధ్యక్షుడు కొంటు సుమన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరికృష్ణ చారి, మాధవరావు, ముఖ్య సలహాదారు కృష్ణమోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






