ఏ ఎన్నిక‌లు జ‌రిగినా బీజేపీ విజ‌యం సాధించేందుకు కృషి చేయాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తూ, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం కృషి చేస్తూ, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కీలక పాత్ర పోషించాల‌ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. కొండాపూర్ మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో మదీనా గూడ డివిజన్ కు చెందిన విష్ణు దత్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి ర‌వికుమార్ యాద‌వ్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్ధతతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా పార్టీ గెలుపుకోసం కృషి చేస్తూ అధికారంలోకి తీసుకురావడానికి పనిచేయాలని సూచించారు. అలవికాని అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 12 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని, తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే అధికారంలోకి రావడం తథ్యమ‌న్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎత్తిచూపుతూ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సాయి, వేణు, సిద్దు, వంశీ, భారతీయ జనతా పార్టీ నాయకులు నాగులు గౌడ్, జితేందర్, మహేష్ యాదవ్, సత్యనారాయణ రాజు, రమణయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here