శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఎం.ఏ నగర్ లో బస్తీ ప్రజలు కలిసి నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. బస్తీ నాయకుడు, అధ్యక్షుడు యాది, ఉపాధ్యక్షులు రాములమ్మ, లచ్చప్ప, తిమ్మయ్య, స్వామి, చిన్న తెల్లప్ప, చంద్రకాంత్ ఆహ్వానం మేరకు జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, మీడియా ఇంచార్జ్ ప్రశాంత్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా TRP నాయకులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని బస్తీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానికులు నిర్మించిన ఆలయం ప్రాంతం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలతో మమేకమైన నాయకులు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మిషన్ భగీరథ తాగునీటి సదుపాయం, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజల అభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల కల్పనలో TRP పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





