దాహార్తిని తీర్చేందుకు చ‌లివేంద్రాలు ఎంతో దోహ‌దం చేస్తాయి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ లో చైతన్య నగర్ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు, బాటసారులకు అందజేశారు. ఈ  సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, నర్సయ్య, బాలరాజు, నర్సింహ చారి, వేణు, కృష్ణం రాజు, యాదగిరి, నాగచారి, శ్రీను, శ్యామ్ ప్రసాద్, విజయ్ కుమార్, కృష్ణ రావు, సంతోష్, వెంకటేష్, అనిల్ కుమార్, మల్లేష్, నవీన్ చారి, బాలకృష్ణ, లక్ష్మణ్, సాయి , సాయి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here